సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (17:01 IST)

అక్షయ్ కుమార్‌తో ఊ.. అంటావా పాటకు స్టెప్పులేసిన సమంత (Video)

Akshay Kumar_Samantha
Akshay Kumar_Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చైతన్యతో విడాకుల తర్వాత సినీ అవకాశాలతో బిజీ బిజీగా వుంది. టాలీవుడ్‌లో  మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అందాల ఆరబోతతో కూడా ఎలాంటి లిమిట్స్ లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. 
 
ఇకపోతే ఇటీవలే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ అనే కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి పాల్గొంది. 
Akshay Kumar_Samantha
Akshay Kumar_Samantha
 
ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు సమంత సమాధానాలు చెప్పింది. అలాగే సమంత షో లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే అక్షయ్ కుమార్ సమంతను ఎత్తుకొని సీటు దగ్గరికి తీసుకు వచ్చి హంగామా చేశాడు.
 
అంతేకాదు ఈ ప్రోమోలో చూసుకుంటే అటు సమంత అక్షయ్ కుమార్‌తో కలిసి డాన్స్ చేసింది. అక్షయ్ కుమార్‌తో ఊ అంటావా సాంగ్‌కు స్టెప్పులేసింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.