సోమవారం, 4 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (17:51 IST)

ఐకాన్ స్టార్ సృష్టించిన ప్రభావం ఇండియా టుడే క‌వ‌ర్ పిక్‌

Icon star Alluarjun
Icon star Alluarjun
ఇండియా టుడే తన కవర్‌పై ఐకాన్ స్టార్  అల్లుఅర్జున్‌ని త‌గ్గేదేలే అన్న‌ట్లు భారతీయ సినిమాలో దక్షిణాది ఆధిపత్యం గురించి ఆయ‌న‌ సృష్టించిన క్రాస్‌ఓవర్ విలువ గురించి మాట్లాడుతుంది. ఐకాన్ స్టార్ సృష్టించిన ప్రభావం భారీగా ఉందని ఇది స్పష్టంగా చూపిస్తుంది.
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత‌టి సంచ‌న‌ల రికార్డ్‌లు సృష్టించిందో తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఆయ‌న‌కు మ‌రింత పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో పుష్ప ది రూల్ మూవీలో పాల్గొన‌నున్నారు. 
 
ఇక అల్లు అర్జున్ సంచ‌నాల‌కు నిద‌ర్శంగా `త‌గ్గెదేలే` అన్న స్ట‌యిల్‌లో ఇండియాలోని మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ అయిన ఇండియా టుడేలో ఈ వారం ఎడిషన్ అల్లు అర్జున్ కవర్ పిక్ తో వచ్చింది. హీరోగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ కెరీర్ గురించి ఈ తాజా ఎడిషన్ విశ్లేషిస్తుంది.  ఆ పత్రిక కవర్ పిక్ లో అల్లు అర్జున్ కవర్ పిక్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది.