సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (12:16 IST)

తగ్గేదేలే అంటోన్న రెజ్లర్... సౌరవ్‌ గుజ్లర్‌ పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌ (Video)

ThaggedheLe
ThaggedheLe
పుష్ప క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఇంకా అవుతూనే వున్నాయి. ఇక వసూళ్ల విషయంలోనూ పుష్ప అదరగొట్టింది. 
 
ముఖ్యంగా హీరో అల్లు అర్జున్‌ రాయలసీమ యాసలో మాట్లాడిన స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'తగ్గేదేలే' ఒక్క డైలాగ్‌ ఇండియాను ఒక్కసారిగా షేక్‌ చేసింది.
 
అభిమానులు సోషల్‌ మీడియాలో ఈ డైలాగ్‌ రీల్స్‌తో హోరెత్తిచ్చారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పుష్ప డైలాగ్స్‌కు రీల్స్‌ చేస్తూ హంగామా చేశారు. 
 
అయితే పుష్ప ఫీవర్‌ కేవలం రీల్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు.స్టేడియంలలో క్రికెటర్లు,స్టేజ్‌‌పై రాజకీయ నాయకుల వరకు పాకింది. 
 
పుష్ప సినిమాలోని 'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌' అనే డైలాగ్‌లను రాజకీయనాయకులు సైతం వాడుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప డైలాగ్ ఫీచర్‌ మరో మెట్టెక్కింది. ఏకంగా రెజ్లింగ్‌ రింగ్‌పై కూడా తగ్గేదేలే మ్యానరిజం హంగామా చేసింది.
 
ఇండియాకు చెందిన ప్రముఖ రెజ్లర్‌ సౌరవ్‌ గుజ్లర్‌ ఇటీవల ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్‌పై ప్రత్యర్థిని ఓడించిన సందర్భంగా పుష్ప సినిమాలోని 'తగ్గేదేలా' మ్యానరిజాన్ని ఇమిటేట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.