సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (12:49 IST)

భాగ్యనగర నడిబొడ్డున ఫార్ములా- హైదరాబాద్ రికార్డు

Formula E
Formula E
ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ 'ఫార్ములా -ఈ' రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. 'ఫార్ములా ఈ-రేస్‌' చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు. 
 
ఫార్ములా ఈకి స్వాగతం అంటూ హ్యాపెనింగ్ హైదరాబాద్ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. 'ఫార్ములా ఈ' సీఈవో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయనతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. 
 
ఈ రేసు ఆతిథ్యం హైదరాబాద్‌కు దక్కేలా కేటాయించేలా మంత్రి కేటీఆర్ కృషి చేశారు. దేశంలో జరిగే మొదటి 'ఈ-రేస్' కు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది.