వోక్స్‌వేగన్ 'వర్టుస్' కోసం భారతదేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటు
భారతదేశంలో ప్రీమియం మిడ్ సైజ్ విభాగానికి పునరుత్తేజం కలిగించే లక్ష్యంతో ఇటీవలనే వోక్స్‌వేగన్ వర్టుస్‌ను వోక్స్‌వేగన్ ప్యాసెంజర్ కార్స్ ఇండియా విడుదల చేసింది. పరిచయం చేసిన నాటి నుంచి వోక్స్‌వేగన్ వర్టుస్‌కు అపూర్వమైన స్పందన వినియోగదారుల నుంచి లభించింది. భారతదేశంలో ఈ బ్రాండ్ పట్ల వినియోగదారుల అభిమానానికి దర్పణంగా తమ బిగ్ బై డెలివరీ, మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ను భారతదేశ వ్యాప్తంగా నిర్వహించింది.
నూతన వోక్స్‌వేగన్ వర్టుస్ పరిచయంతో, ఈ బ్రాండ్ ఇప్పుడు సెడాన్ విభాగం పట్ల ప్రేమ, అభిమానాన్ని తిరిగి తీసుకువచ్చింది. ఈ అపూర్వమైన స్పందనకు నిదర్శనంగా మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ద్వారా భారతదేశ వ్యాప్తంగా వోక్స్‌వేగన్ వర్టుస్ 2000 యూనిట్లను డెలివరీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన వాస్తవమేమిటంటే, వోక్స్‌వేగన్ వర్టుస్ ఇటీవలనే జాతీయ రికార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ప్ వద్ద సృష్టించింది. కేరళలోని ఓ డీలర్‌షిప్ వద్ద 150 మంది వినియోగదారులకు ఒకే రోజు వోక్స్‌వేగన్ వర్టుస్ వాహనాలను డెలివరీ చేయడం ద్వారా సెడన్ విభాగంలో అత్యధిక వాహనాల డెలివరీగా రికార్డు సృష్టించింది.
ఈ విషయాన్ని వెల్లడించిన వోక్స్‌వేగన్ ప్యాసెంజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శ్రీ అశీష్ గుప్తా మాట్లాడుతూ, వోక్స్‌వేగన్ ఇండియా వద్ద మేము మా నూతన వోక్స్‌వేగన్ వర్టుస్ వినియోగదారుల మనసులను గెలుచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆకట్టుకునే డిజైన్, అసాధారణ పనితీరు, జర్మన్ ఇంజినీరింగ్‌ను ఇది కలిగి ఉంది. వోక్స్‌వేగన్ వర్టుస్‌కు వినియోగదారుల నుంచి లభిస్తోన్న అపూర్వమైన ప్రేమ, అభిమానం, అత్యద్భుతమైన స్పందన భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన మెగా డెలివరీ ప్రోగ్రామ్‌లో కనిపించింది. మా నూతన వినియోగదారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వోక్స్‌వేగన్ ఉత్పత్తులు, సేవలను అత్యుత్తమంగా అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని అన్నారు.
నూతన వోక్స్‌వేగన్ వర్టుస్ భారతదేశ వ్యాప్తంగా 152 సేల్స్ టచ్‌పాయింట్ల వద్ద ప్రత్యేక పరిచయ ధర 11.21 లక్షల రూపాయలు (ఎక్స్ షో రూమ్) వద్ద లభ్యమవుతుంది. ప్రీమియం మిడ్ సైజ్ విభాగంలో నూతన ప్రవేశంగా నూతన వోక్స్‌వేగన్ వర్టుస్‌ను ఎంక్యుబీ ఏఓ ఇన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. దీనిని పూనెలోని చకన్ వద్దనున్న తయారీ కేంద్రం వద్ద తయారుచేశారు. డైనమిక్ మరియు పెర్‌ఫార్మెన్స్ లైన్ వేరియంట్లలో ఫోక్స్‌వేగన్ వర్టుస్‌ను అందిస్తున్నారు. అత్యున్నత శ్రేణి ఫీచర్లను ఇది కలిగి ఉంది. దీనిలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన టీఎస్‌ఐ టెక్నాలజీ ఉంది. ఇది 2 ఇంజిన్లు,3 ట్రాన్స్‌మిషన్ అవకాశాలతో లభిస్తుంది.
నూతన వోక్స్‌వేగన్ వర్టుస్ ఆరు అత్యద్భుతమైన రంగులలో లభిస్తాయి. వినియోగదారులు వైల్డ్ చెర్రీ రెడ్, కార్బన్ స్టీల్ గ్రే, రిఫ్లెక్స్ సిల్వర్, కర్కుమ ఎల్లో, క్యాండీ వైట్, రైజింగ్ బ్లూలో లభిస్తాయి. తాము చేసే ప్రతి కార్యక్రమంలోనూ వినియోగదారులే ముందు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వోక్స్‌వేగన్ వర్టుస్ 4ఎవర్ కేర్ ప్యాకేజీని 4 సంవత్సరాలు/1,00,000 కిలోమీటర్ల వారెంటీతో అందిస్తుంది. దీనిని 7 సంవత్సరాలు, 4 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ను 10 సంవత్సరాలు, మూడు సంవత్సరాల ఉచిత లేబర్ సేవలతో పాటుగా అందిస్తుంది. అంతేకాదు, పూర్తి అందుబాటు ధరలో యాజమాన్య అనుభవాలను వినియోగదారులు పొందేందుకు వీలుగా వారు తమ ప్రాధాన్యతా లాయల్ ప్రొడక్ట్ అయిన సర్వీస్ వాల్యూ ప్యాకేజీలు, ఎక్స్‌టెంటెండ్ వారెంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను తమ ప్రాధాన్యతా డీలర్‌షిప్ లేదా ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పొందవచ్చు.