ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (19:51 IST)

ఎన్‌సీడీఈకు బస్సు, ఈ-కార్ట్‌ను విరాళంగా అందించిన వర్ట్యుసా

డిజిటల్‌ స్ట్రాటజీ, డిజిటల్‌ ఇంజినీరింగ్‌, ఐటీ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన వర్ట్యుసా కార్పోరేషన్‌ నేడు ఓ బస్సు, ఈ-కార్ట్‌‌ను సీఆర్‌పీఎఫ్‌ యొక్క ఎన్‌సీడీఈ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ దివ్యాంగ్‌ ఎంపవర్‌మెంట్‌)కు అందించింది.

హైదరాబాద్‌లోని షామీర్‌పేట వద్దనున్న సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో దివ్యాంగుల కదలికలకు, ఇతర కంపెనీల శిక్షణా కార్యక్రమాలకు వీటిని వినియోగించనున్నారు. భారత ప్రజల రక్షణ కోసం వీరోచితంగా పోరాడుతూ తమ అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు తగిన శిక్షణ, సాధికారితను అందించే లక్ష్యంతో ఎన్‌సీడీఈని ఏర్పాటు చేశారు.
 
ఈలో ఫ్లోర్‌ బస్‌ను వర్ట్యుసా విరాళంగా అందజేసింది. అతి సులభంగా వీల్‌ చైర్లు లోపలకు, బయటకు వెళ్లేందుకు వీలుగా ఈ బస్సు ఉండటంతో పాటుగా దివ్యాంగులకు సౌకర్యవంతమైన ఫీచర్లను ఎన్నింటినో కలిగి ఉంది. ఈ బస్సు మరియు ఈ-కార్ట్‌ను నేడు షామీర్‌పేటలోని ఎన్‌సీడీఈ క్యాంపస్‌లో అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌ జోన్‌ అడిషనల్‌ డీజీ శ్రీమతి రష్మీ శుక్లా, ఐపీఎస్‌ మరియు వర్ట్యుసా సీనియర్‌ సభ్యులు, ఉపాధ్యక్షులు శ్రీ మోహిత్‌ శర్మ, కృష్ణ ఎదుల పాల్గొన్నారు.