పుష్ప ఇక పార్టీ చేసుకో.. అల్లు అర్జున్‌కు మెగాస్టార్ ట్వీట్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్‌కి తన మామ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెష్ చెప్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
'హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వచ్చేలా చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో'' అని పోస్ట్ చేశారు.
చిరంజీవి అల్లు అర్జున్‌కి విషెస్ తెలపడంతో చిరు ట్వీట్‌పై బన్నీ అభిమానులు లైక్స్, రీట్వీట్స్‌తో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్‌కు చాలా తక్కువ టైంలోనే 20 వేలకు పైగా లైక్స్, 4 వేలకి పైగా రీట్వీట్స్ అందాయి.