శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (12:52 IST)

బన్నీ వాసు మోసగాడు.. పవన్ గారూ న్యాయం చేయండి

సినీ ప్రొడ్యూసర్‌ బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసారంటూ జూనియర్‌ ఆర్టిస్ట్‌ సునీత బోయ కొన్నిరోజులుగా ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని..అనంతరం అబార్షన్ చేయించాడని బోయ సునీత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 
 
అంతేకాదు నిర్మాత బన్నీ వాసుపై అనంతపురం జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసింది. తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారని.. అంతేకాకుండా.. అబార్షన్ కూడా చేయించారని.. ఇదే విషయంపై రెండేళ్లుగా తనకు న్యాయం చేయాలని పోరాడుతున్నట్లు ఆమె ఆరోపించింది.
 
ఈ నేపథ్యంలో తాను జనసేన పార్టీకోసం పనిచేశాను కాబట్టి అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు గోడు చెప్పుకోడాలని మంగళగిరి జనసేన ఆఫీస్‌కు వచ్చినట్లు బోయ సునీత తెలిపారు. అయితే ఆఫీస్ సిబ్బంది తనను లోపలికి రానివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్‌కు విజ్ణప్తి చేస్తూ.. జనసేన కార్యాలయం బయట సునీత నిరసన చేపట్టింది. బన్నీ వాసు మోసగాడని.. ఆయనకు పార్టీ టికెట్ ఎలా ఇస్తారని పవన్ కల్యాణ్‌ను బోయ సునీత నిలదీసింది.