1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (14:37 IST)

సొంత పార్టీ పెట్టుకుని బీజేపీని రోడ్డు మ్యాప్ అడగడం విడ్డూరంగా వుంది : మంత్రి బాలినేని

సొంత పార్టీని నడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని రోడ్ మ్యాచ్ అడగడం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఉందన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇతర పార్టీల కోసం ఇప్పటి నుంచే ద్వారాలు తెరిచారన్నారు. ముఖ్యంగా, బీజేపీ నేతలను రోడ్డు మ్యాప్ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. 
 
ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్‌కు ఇస్తానంటే పొత్తు పెట్టుకున్నా అర్థం ఉంటుందనన్నార. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావించడం ఆయనకే చెల్లుతుందన్నారు. 
 
ఎవరినో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి రాష్ట్ర సమస్యలను పవన్ కళ్యాణ్ ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిందన్నారు. అదేసమయంలో ఈ దఫా అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారని చెప్పారు.