శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (13:49 IST)

2024 ఎన్నికలపై పీకే కీలక వ్యాఖ్యలు.. బీజేపీకి చుక్కలు ఖాయం

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ 2024లో మాత్రం బీజేపీని చుక్కలు చూపిస్తుందన్నారు. 
 
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ తమ నేతలను ఏకతాటిపైకి రానిస్తే.. బీజేపీ చెమటలు పట్టించడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కాంగ్రెస్‌కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉందని పీకే అన్నారు.
 
2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఉందని పేర్కొన్న ప్రశాంత్ కిశోర్.. బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తూర్పు, దక్షిణ భారతదేశంలోని దాదాపు 200 స్థానాల్లో 50 కంటే ఎక్కువ సీట్లను సాధించేందుకు ఇప్పటికీ పోరాడుతోందని గుర్తు చేశారు.