గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (15:42 IST)

బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే.. వారికి అనుమతి లేదు

స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డితో సస్పెన్షన్ కు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు.అంతకు ముందే అసెంబ్లీ సెక్రటరీతో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతివ ప తెలిసిందే.
 
హైకోర్టు తీర్పు కాపీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు అందించారు. అసెంబ్లీకి అనుమతిపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. 
 
అయితే ఈ విషయమై ఎమ్మెల్యేలతో స్పీకర్ చర్చించారు. ఎమ్మెల్యేలు కూడా  తమ వాదనను స్పీకర్ ముందుంచారు. అయితే తమ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు.