గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (16:20 IST)

మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుంచి ఒంటి  పూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా రేపటి నుంచి ఒంటి పూట బడుల నిర్వహించాలని ఆదేశించింది. 
 
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయని విద్యా శాఖ జీవోలో పేర్కొంది. మధ్యాహ్నం క్లాసులు ముగిసిన తర్వాత యథావిధిగా మిడ్ డే మీల్స్ కొనసాగించాలని ఆదేశించింది. 
 
మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత పిల్లలను ఇంటికి పంపాలని సూచించింది. 
 
అయితే పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రిపరేషన్ కోసం స్పెషల్ క్లాసులు కొనసాగించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.