మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (15:34 IST)

దక్షిణాది మార్కెట్‌ కోసం ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారుచేసిన ట్రూఫ్లో బై హింద్‌వేర్‌

భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్లాస్టిక్‌ పైపులు, ఫిట్టింగ్స్‌ బ్రాండ్‌ ట్రూఫ్లో బై హింద్‌వేర్‌, నేడు తమ తెలంగాణా ప్లాంట్‌ నుంచి ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారుచేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా దక్షిణ భారతదేశపు మార్కెట్‌ అవసరాలను తీర్చనుంది. ఈ వాటర్‌ స్టోరేజీ పరిష్కారాలను తొలుత నెలకు 45 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేయనున్నారు. అనంతర కాలంలో ఈ బ్రాండ్‌ మార్కెట్‌లో మరింతగా విస్తరించిన తరువాత డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సైతం వృద్ధి చేయనున్నారు.

 
ఈ తయారీ కేంద్రంలో తయారైన ఉత్పత్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్నాటక, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు.... అంటే నాగ్‌పూర్‌, షోలాపూర్‌, అకోలా, నాందేడ్‌, చుట్టుపక్కల ప్రాంతాలలో అవసరాలను తీర్చనున్నాయి. తెలంగాణాలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ట్రూఫ్లో పైప్స్‌ సీఈవో శ్రీ రాజేష్‌ పజ్నూ ఈ అంశాలను వెల్లడించారు.

 
ఈ ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను ఫుడ్‌ గ్రేడ్‌ ప్రమాణాలు కలిగిన ఎల్‌ఎల్‌డీపీఈ మెటీరియల్‌తో తయారు చేశారు. దీనిని సిల్వర్‌ అయాన్‌ (జర్మన్‌గార్డ్‌) శక్తితో కూడిన యాంటీ బ్యాక్టీరియల్‌ శుద్ధి చేశారు. దీని కారణంగా సూక్ష్మజీవుల వృద్ధిని ఇది అడ్డుకుంటుంది. సుదీర్ఘకాలం పాటు నీటి సరఫరా స్ధాయిని నిలిపి ఉంచుతుంది. ఈ వేరియంట్లు అదనంగా యువీ ప్రొటెక్టడ్‌ కావడంతో పాటుగా భారలోహ రహితంగా ఉంటాయి. ఈ నూతన ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ స్టోరేజీ పరిష్కారాలు- డ్యూరా మరియు డ్యూరా కూల్‌లు ఐదు సంవత్సరాల వారెంటీ తో వస్తాయి. ఇవి 500 లీటర్లు నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో విభిన్నమైన మార్కెట్‌ అవసరాలకు తగినట్లుగా విభిన్నమైన రంగులలో వస్తాయి.

 
డ్యూరా వేరియంట్‌ మూడు లేయర్ల ట్యాంకులను అందిస్తుంది. ఇది భద్రత మన్నికకు పూర్తి హామీని ఇస్తుంది. డ్యూరా కూల్‌ వేరియంట్‌లో నాలుగు లేయర్లు ఉంటాయి. ఇది ప్రీమియం నాణ్యతతో కూడిన ఇన్సులేషన్‌ను అందిస్తుంది. ఇది నీటి ఉష్ణోగ్రతను పూర్తి చల్లగా ఉంచుతుంది. తద్వారా ఇది గృహ- పారిశ్రామిక  అవసరాలకు తగినట్లుగా ఉంటుంది.

 
ఈ ప్రకటన గురించి శ్రీ రాజేష్‌ పజ్నూ మాట్లాడుతూ, ‘‘అతి స్వల్పకాలంలోనే, ట్రూ ఫ్లో బై హింద్‌వేర్‌ పరిశ్రమలోనూతన బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. తెలంగాణాలోని మా తయారీ కేంద్రం వద్ద వాటర్‌ ట్యాంకులను తయారుచేస్తుండటం పట్ల మేము పూర్తి సంతోషంగా ఉన్నాము. మా ఉత్పత్తులను పూర్తి నాణ్యతతో పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత కఠినమైన తయారీ పద్ధతులను అనుసరించి తయారుచేశాము.

 
ఉత్తరాది మార్కెట్‌లలో విజయవంతంగా ఆవిష్కరించిన తరువాత, మా వినియోగదారులు ఏం కోరుకుంటున్నారో మేము అర్థం చేసుకోగలిగాము. ఈ కారణం చేతనే మేము దక్షిణాది మార్కెట్‌లో మా వినియోగదారుల అవసరాలను సమూలంగా తీర్చగలిగాము. మా నైపుణ్యంతో పాటుగా మా శక్తివంతమైన తయారీ సామర్థ్యాలు అత్యంత కీలకమైన పాత్రను పోషించడంతో పాటుగా మా మార్కెట్‌ ఉనికికి బలోపేతం చేస్తుంది’’ అని అన్నారు.

 
అధికంగా అసంఘటిత రంగంలోని తయారీదారులు ఆధిపత్యం వహిస్తున్న వాటర్‌ ట్యాంక్‌ మార్కెట్‌, రాబోయే కొద్ది సంవత్సరాలలో భారతదేశంలో స్థిరంగా 10% వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. బహుళ అంశాలు మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో నిర్మాణ రంగంలో వృద్ధి మరీ ముఖ్యంగా టియర్‌ 2, టియర్‌ 3 మార్కెట్‌లలో నిర్మాణ కార్యకలాపాలు పెరగడంతో పాటుగా ఉత్సాహపూరితమైన నీటి మౌలిక వసతులు వృద్ధి చెందడం అనేవి అత్యున్నత గ్రోత్‌ డ్రైవర్లుగా నిలిచాయి.

 
కంపెనీ యొక్క అత్యాధునిక ప్లబింగ్‌ తయారీ ప్లాంట్‌ పూర్తి స్ధాయిలో ఆటోమేటెడ్‌ సదుపాయంగా ఐజీబీసీ ప్రమాణాలు మరియు గ్రీన్‌కో ప్రమాణాలు కలిగి ఉండటంతో పాటుగా ఐజీబీసీ నుంచి ప్లాటినమ్‌ సర్టిఫైడ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌గా నిలిచింది. దీనికి తోడు, దీని యొక్క నిలకడైన తయారీ ప్రక్రియలు సీఐఐ నుంచి గ్రీన్‌కో ప్లాటినమ్‌ రేటింగ్‌ పొందాయి. దేశంలో ప్లాస్టిక్‌ పైపులు మరియు ఫిట్టింగ్‌ పరిశ్రమ వ్యాప్తంగా రెండు ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్లను పొందిన మొట్టమొదటి తయారీ కేంద్రమిది.