సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (19:23 IST)

జేఈఈ ఎగ్జామ్స్ క్లాష్: ఇంటర్ పరీక్షల తేదీల్లో మళ్లీ మార్పులు

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల తేదీలు మారనున్నాయి. జేఈఈ ఎగ్జామ్స్ తేదీలతో క్లాష్ కావడంతో రీషెడ్యూల్ చేసిన అధికారులు కొత్త తేదీలను విడుదల చేశారు. అయితే ఈ కొత్త తేదీలు రీ షెడ్యూల్ చేసిన ఇంటర్, తెలంగాణ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ క్లాష్ అయ్యాయి.
 
దీంతో తెలంగాణ, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి విడత ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ఏప్రిల్ 22న ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమై మే 7న ముగియనున్నాయి.
 
ఇంకా ఏపీ విషయానికి వస్తే అక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 22న ప్రారంభమై మే 7న ముగియనున్నాయి. అయితే.. ఇంటర్ ఎగ్జామ్స్, జేఈఈ ఎగ్జామ్స్ ఒకేసారి ఉండడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలు, ప్రిపరేషన్ విషయంలో ఇబ్బందులు పడే పరిస్థతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన తేదీలను మార్చే అవకాశం ఉంది.