సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (13:19 IST)

హైదరాబాద్‌లో టెక్కీ అనుమానాస్పద మృతి

హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పదరీతో మృతి చెందారు. భాగ్యనగరిలో టెక్కీగా పనిచేస్తున్న హరీశ్‌ మెట్ పల్లి వాసిగా గుర్తించారు. టూవీలర్ బావిలోపడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మృతిలో సందేహం ఉన్నట్టు మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 
 
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం, వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో హరీశ్ (31) ద్విచక్రవాహనం పడిపోయింది. దీంతో హరీశ్ ప్రాణాలు కోల్పోయాడు. యేడాదిన్నర క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హరీశ్... వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో ఫోనులో మాట్లాడిన హరీష్ ఆ తర్వాత బైకుపై బయటకు వెళి మృత్యువుగా మారాడు.