శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (18:00 IST)

కేసీఆర్ బండారాన్ని ఈటెల బయటపెట్టారు... అందుకే..?

అసెంబ్లీ బడ్జెట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ అంకెల గారడీతో మోసం చేశారని.. కేసీఆర్ బండారాన్ని ఈటెల బయటపెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఏ పథకమైనా సరే అందులో అవినీతిని బయట పెడుదామంటే భయపడి అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ పేరిట బయటకు పంపించారన్నారు. 
 
నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో కేసీఆర్ నోట మాట పడిపోయిందని డీకే అరుణ వెల్లడించారు. అంతకుముందు వరకు ఫ్రంట్‌ పెడతా అని అన్ని రాష్ట్రాల తిరిగారని, 4 రాష్ట్రాల గెలుపుతో భయపడి సైలెంట్ అయ్యారన్నారు. 
 
కేసీఆర్‌కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని పెట్టలేదని ఆయన మండిపడ్డారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజునే బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ పోచారం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.