శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (17:29 IST)

ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎన్.ఎస్.యు.ఐ పట్టు - ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించి తక్షణ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి విభాగం అయిన ఎన్.ఎస్.యు.ఐ ఆందోళనకు దిగింది. ఈ ప్రధాన డిమాండ్‌తో టీఎస్ పీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే, అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 
 
దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. గాంధీ భవన్‌ నుంచి కమిషన్ కార్యాలయం వైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్లు జారీ చేయాలని వారు కోరారు. 
 
ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేసేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థులు ప్రకటించారు. అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనల్ సీవీ ఆనంద్‌కు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.