శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (11:16 IST)

మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా హైద‌రాబాద్‌లోనే - హైపర్ ఆది

Hyper Adi, Chandini, Manoj‌
మోడలింగ్ రంగంలో ఎదగాలన్న కల‌ను సాకారం చేసేందుకు వింగ్స్ మోడల్ హబ్ ఆధ్వ‌ర్యంలో కాంటెస్ట్ జ‌రుగుతోంది.  ఈ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పోస్టర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం రాత్రి హైద్రాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్ చాందిని, జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, కిరాక్ ఆర్పీ, మహేష్, కృతిక మిస్సెస్ ఇండియా 2018, జాహ్నవి, మిస్ తెలంగాణ అంజు, హరి, శాంతి భూషణ్, మనోజ్, పవన్,  అర్జున్ తోపాటు  తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
 
హైపర్ ఆది మాట్లాడుతూ .. ముందుగా మనోజ్ అన్నకు థాంక్స్ చెప్పాలి. వింగ్స్ మోడల్ హబ్ ఆధ్వర్యంలో ఇంతవరకు హైద్రాబాద్ లో కార్యక్రమాలు చేసాడు , ఈ సారి పాన్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల నుండి మోడల్స్ ని తీసుకొచ్చి మే 29న హైదరాబాద్ లో జరిగే గ్రాండ్ ఫినాలే లో ఫైనల్ విన్నర్‌ని ఎంపిక చేస్తారు. ఈ వింగ్స్ హబ్ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సురేష్ కొండేటి సపోర్ట్ ఇచ్చాడంటే చాలు.. ఆయన ద్వారా ఎన్నో సినిమాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి.
 
హీరోయిన్ చాందిని మాట్లాడుతూ.. నేను తెలుగులో చాలా సినిమాలు చేస్తున్నాను. నేను రధం, దీక్సూచి రెండు సినిమాలు చేశాను..  ప్రస్తుతం ఫోర్టీన్ డేస్ లవ్ సినిమా చేస్తున్నాను. వింగ్స్ మోడల్ హబ్ బ్రోచర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక చాలా మంది టాలెంట్ ఉన్నవాళ్లకు మంచి ప్లాట్ ఫార్మ్ అని నా అభిప్రాయం, కాబట్టి టాలెంట్ ఉన్నవాళ్లు తప్పకుండా మీ ప్రయత్నాన్ని ఈ వేదిక ద్వారా సక్సెస్ చేసుకోండి, ఈ కార్యక్రమం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
Hyper Adi, Chandini, Manoj‌, suresh and ohters
మనోజ్ వీరగోని మాట్లాడుతూ .. ఈ కార్యక్రమం చేయడానికి నాకు సపోర్ట్ చేస్తున్న టీం ఇక్కడ ఉంది. వీళ్ళ సపోర్ట్ లేకుంటే నేను ఏదీ చేయలేను. ఇప్పటి వరకు హైదరాబాద్ లో చేసిన ఈ కార్యక్రమాన్ని ఇకపై పాన్ ఇండియా లెవెల్లో చేయాలని ప్లాన్ చేసాం. ఈ కార్యక్రమం గురించి చెప్పగానే బాలీవుడ్ స్టార్ అర్బాజ్ ఖాన్  బాగుంది అని సపోర్ట్ అందిస్తున్నారు. ఈ వేడుకలో ఆయనకూడా పాల్గొంటారు. ఆయనే మాకు మెంటర్,  మే 29న  హైద్రాబాద్లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది, చాలా గ్రాండ్గా జరిగే కార్యక్రమం ఇది.
 
కృతిక మాట్లాడుతూ .. మనోజ్ వీరగోని మిస్టర్ తెలంగాణా గా ఎంపిక అయినప్పటినుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. అతను చాలా ప్యాషన్ తో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ సారి మిస్, అండ్ మిస్టర్ ఇండియా ను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అన్నారు.
 
జాహ్నవి మాట్లాడుతూ .. చాలా ఆనందంగా ఉంది.. మనోజ్ వీరగోని ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాం చేయడం నిజంగా చాలా గర్వాంగా ఉంది. తప్పకుండా మనోజ్ చేస్తున్న ప్రయత్నం చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
సురేష్ కొండేటి మాట్లాడుతూ.. మిస్ ఇండియా గా ఎన్నికయిన చాలా మంది హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. అలాగే ఈ వింగ్స్ ద్వారా ఏర్పాటు చేస్తున్న మిస్ అండ్ మిస్టర్ ఇండియా గా చాలా మంది పాల్గొనాలని, అలాగే ఇందులో విన్నర్ అయినవాళ్లకు సినిమాల్లో కూడా చాలా అవకాశాలు వస్తాయి అన్నారు.