మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (12:55 IST)

ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుకు కొత్త జీవో-సీఎంకు మహేష్ కృతజ్ఞతలు

Mahesh Babu
ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసిన నేపథ్యంలో.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రపరిశ్రమలో నెలకొన్న సమస్యలపై సీఎం జగన్‌తో టాలీవుడ్ స్టార్ హీరోలు భేటీ అయ్యారు. 
 
టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్‌లతో పాటు దర్శకుడు రాజమౌళి, అలీ తదితరులు సీఎం జగన్‌తో సమావేశమై సినిమా టికెట్ల రేట్ల పెంపుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా త్వరలోనే సినిమా టికెట్ల రేట్లపెంపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు. చెప్పినట్లుగానే సినిమా టికెట్ల ధరలను పెంచుతూ జీఓ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చిరంజీవి, ప్రభాస్‌లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
 
"కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్ని నాని గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం" అని పేర్కొన్నారు.