శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (16:49 IST)

మార్చి 12న కర్నూలులో అఖండ కృతజ్ఞత సభ

Akhanda team
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండ 100 రోజుల వేడుక ‘అఖండ కృతజ్ఞత సభ’ మార్చి 12న కర్నూలులో జరగనుంది. ఈ వేడుకకు చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది.
 
ఆంద్రప్రదేశ్‌లో కరోనా థర్డ్ వేవ్‌తో పాటు తక్కువ-టికెట్ ధర వంటి అనేక అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ విజ‌యంతో నిజమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం బయ్యర్లందరికీ భారీ లాభాలను అందించింది.
 
బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం అఖండ, అలాగే హీరోగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం. దర్శకుడు బోయపాటి,  నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్‌కు కూడా ఇది అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టింది.  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ను కూడా పూర్తి చేశారు.
 
ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది.