శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (16:58 IST)

నంద‌మూరి బాల‌కృష్ణ వేట మొద‌లైంది - న్యూ లుక్ అదుర్స్‌

Nandamuri Balakrishna new look
అఖండ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ, క్రాక్ వంటి సక్సెస్‌ఫుల్ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో బాల‌య్య‌107వ సినిమాగా  ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.
 
ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే సిరిసిల్ల టౌన్‌ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొద‌లుపెట్టారు మేక‌ర్స్‌. బాలకృష్ణ - ఫైటర్స్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన నంద‌మూరి బాల‌కృష్ణ లుక్ సోమ‌వారంనాడు చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల‌చేసింది. బ్లాక్ డిఫెండ‌ర్ కారు ప‌క్క‌నే బాల‌కృష్ణ లుంగీ, బ్లాక్ ష‌ర్ట్ వేసుకుని న‌డుస్తున్న స్టిల్ బయ‌ట‌కు విడుద‌ల చేశారు. దీనికి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. మొదటి లుక్ లోనే నందమూరి నటసింహం చంపేశారు!! డేరింగ్ గా వచ్చే వాడికి దిమాక్ కరాబ్ చేయడం గ్యారంటీ. అంటూ అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.
 
కాగా, యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
 
బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్  తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు.
 
న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌, నవీన్ నూలీ ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్, దునియా విజ‌య్, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్‌