వై.ఎస్. జగన్ గురించి నందమూరి రామకృష్ణ ఏమన్నారంటే!
తెలుగు దేశం పార్టీ స్థాపకుడు స్వర్గీయ ఎన్.టి.ఆర్. పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నందమూరి రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగు జాతిమనదీ నిండుగ వెలుగు జాతి మనది…ప్రాంతాలు వేరైనా మనమందరం తెలుగు బిడ్డలు ఒక్కటేనని చాటిచేప్పి… తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జీవింప చేసి ఎర్రకోటపై మన తెలుగు జాతి పతాకం ఎగరేసిన మన తెలుగు వెలుగు, యుగపురుషుడు కారణజన్ముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారి పేరిట “ఎన్.టి.ఆర్ జిల్లా”, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము తెలుగోడు గర్వపడే విధముగా తీసుకున్న నిర్ణయం చాలా సంతోషదాయకం, స్వాగతిస్తున్నాము . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలుపుతూ పేర్కొన్నారు.
ఇక ఈ ఏడాది బాలకృష్ణకు అచ్చి వచ్చిందనే చెప్పాలి. బోయపాటి శ్రీనుతో చేసిన `అఖండ` విజయం బాలీవుడ్‌ను కూడా షేక్ చేసింది. మరోవైపు అన్ స్టాపబుల్ అంటూ ఓటీటీలో ఆయన చేసిన ప్రోగ్రామ్‌కు ప్రజలు ఆదరణ చూపారు. ఇప్పుడు ఎన్.టి.ఆర్ పేరుతో జిల్లాను వై.ఎస్. జగన్ ప్రకటించడం విశేషం.