గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (11:42 IST)

నేటి నుంచి హాట్‌స్టార్ బాలకృష్ణ "అఖండ" స్ట్రీమింగ్

యువరత్న బాలకృష్ణ నటించిన "అఖండ" చిత్రం శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే, నేచరుల స్టార్ నాని నటించిన "శ్యామ్ సింగరాయ్" కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. 
 
సాధారణంగా చాలా చిత్రాలు విడుదలైన 20 రోజులకే ఓటీటీలో విడుదలవుతున్నాయి. కానీ, బాలకృష్ణ చిత్రం అఖండ మాత్రం విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 
 
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించారు. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ వంటివారు ఇతర కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతం సమకూర్చారు. 
 
భారీ అంచనాల మధ్య డిసెంబరు 2వ తేదీన విడులైన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే మంచి విజయం సాధించింది. ఈ సినిమా గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.