మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (10:37 IST)

నందినిరెడ్డికి పుట్టిన రోజు.. ఆమె మాటలు మామూలు మనిషిగా మార్చాయ్

Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు స్నేహితులతో కొదవలేదు. దర్శకురాలు నందిని రెడ్డి కూడా సమంతకు బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. ఇవాళ నందిని రెడ్డి పుట్టినరోజు కావడంతో సమంత ఎమోషనల్‌గా స్పందించింది. 
 
2012లో జరిగిన ఓ సంఘటనతో తాను ఎంతో కుంగిపోయానని సమంత వెల్లడించింది. కెరీర్ ఇక ముందుకు సాగదన్న బలమైన నిర్ణయానికి వచ్చానని, అసలు ఆత్మవిశ్వాసం అన్నదే లేకుండా పోయిందని తెలిపింది. 
 
అలాంటి సమయంలో నందిని రెడ్డి వచ్చిందని, తనలో ఎంతో ధైర్యం నింపిందని సమంత పేర్కొంది. నందిని రెడ్డి మాటలు తనను మామూలు మనిషిగా మార్చాయని, ఆనాడు నందినిరెడ్డి కలిగించిన స్ఫూర్తితో ఆ మరుసటి రోజే సినిమా రంగానికి పునరంకితం అయ్యానని సమంత వివరించింది.