ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (13:51 IST)

'ఏ మాయ చేశావే'కు 12 ఏళ్లు.. అలాంటి ఫ్యాన్స్ ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు

Samantha
అక్కినేని నాగచైతన్యతో హీరోయిన్ సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఏ మాయ చేశావే' 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భావోద్వేగ పోస్టు చేసింది. ఆ సినిమా 2010, ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌లైంది. నేటితో సినీ పరిశ్ర‌మ‌లో అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్త‌వుతున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రంగా 'ఏ మాయ చేశావే' తెరకెక్కింది. 
 
లైట్స్‌, కెమెరా, యాక్ష‌న్‌, ఎలాంటి పోలిక‌లూ స‌రిపోని క్ష‌ణాల వంటి 12 ఏళ్ల జ్ఞాప‌కాలు, అనుభ‌వాలు గుర్తుకు వ‌స్తున్నాయని తెలిపింది. ఈ గొప్ప‌ ప్ర‌యాణం, ప్ర‌పంచంలోనే అత్యంత విధేయ‌త ఉన్న‌ అభిమానులను ఇచ్చినందుకు భ‌గ‌వంతుడికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నానని సమంత పేర్కొంది. 
 
సమంత ఫిల్మోగ్రఫీ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ భాషల్లో ఆమె ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో సమంత నటించిన సూపర్ హిట్ చిత్రాలలో అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, అ ఆ, ఈగ, ఓ బేబీ, మజిలీ తదితరాలున్నాయి. తమిళంలో 'తేరి', 'మెర్సల్' హిట్ సినిమాలున్నాయి. ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయ్‌తో సమంత OTT అరంగేట్రం భారీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
 
ఇక అల్లు అర్జున్ యొక్క బ్లాక్ బస్టర్ పాన్-ఇండియా చిత్రం 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ చేసింది. 'ఊ అంటావా' అనే ప్రత్యేక పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.