శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (17:40 IST)

మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్ బాబు

Maheshabu Launching
Mission Impossible Trailer‌ poster
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరో కంటెంట్-రిచ్ ఫిల్మ్ `మిషన్ ఇంపాజిబుల్‌`తో వస్తోంది, ఇందులో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా, `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ దర్శకుడు స్వరూప్ RSJ ఈ మూవీని ఆక‌ట్టుకునేలా రూపొందిస్తున్నారు.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ నిజానికి సినిమా ప్లాట్‌లైన్‌లోని విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్టు,  ఆ త‌ర్వాత‌ బెయిల్ అనే అంశాన్ని చెబుతూ ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయురాలుగా తాప్సీ  డైలాగ్‌తో ప్రారంభమవుతుంది.
 
ఆమె, ఆమె బృందం ఈ మిషన్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని భావించినప్పుడు, వారు తక్కువ సమయంలో ధనవంతుడిగా మారిన భార‌త‌దేశంపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. అసాధ్యమైనది ఏమీ లేదని భావించే తాప్సీ పిల్ల‌ల  ధైర్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోతుంది.  వారు ఈ మిషన్‌ను ఎలా పూర్తి చేస్తారు అనేది కథలో కీలకాంశంగా మారుతుంది.
 
నిజమైన సంఘటన ఆధారంగా  స్వరూప్ RSJ తన అద్భుతమైన రచన,  టేకింగ్‌తో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించారు. ట్రైలర్‌లో సూచించినట్లుగా, ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగులను కలిగి ఉండ‌డ‌మే కాకుండా ఇది యాక్షన్,  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తి ఎంటర్‌టైనర్.
 
తాప్సీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఒక పెద్ద ఎసెట్‌.  ఆమె తన నటనతో మ‌రో స్తాయిని గెలుచుకుంది. కానీ పిల్లలు తమ చ‌లాకీత‌నంతో సినిమాను మ‌రింత‌ఎత్తుకు తీసుకెళ్ళారు. వారు వారి వారి పాత్రలలో కథనానికి తాజాదనాన్ని తీసుకువ‌చ్చారు.
 
దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో పెద్ద అసెట్. సహజంగానే, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా యొక్క జానర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
 
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్.
 
వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి మిష‌న్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1న థియేటర్లలో కనిపిస్తుంది.
 
తారాగణం: తాప్సీ పన్ను
 
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
రచయిత, దర్శకుడు: స్వరూప్ RSJ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాత: N M పాషా
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర
PRO: వంశీ శేఖర్