శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (15:47 IST)

సితారను చూసి మురిసిపోతున్న ప్రిన్స్.. కళావతికి స్టెప్పులు ఇరగదీసిందిగా..

ప్రముఖ హీరో మహేష్‌ బాబు సితారను చూసి మురిసిపోతున్నాడు. ఇంకా ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను ప్రస్తుతం అభిమానులతో పంచుకున్నారు. ఆయన నటిస్తున్న 'సర్కార్‌ వారి పాట' చిత్రం నుండి ఇటీవల 'కళావతి' పాట విడుదలై అందరి అభిమానం పొందుతుంది. 
 
ఈ పాటకు మహేష్‌ బాబు కుమార్తె సితార స్టేపులేసిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా 'మై స్టార్‌.. నువ్వు నాకన్నా బాగా చేశావ్‌' అంటూ ప్రశంసించారు. ఈ వీడియోను చూసి ఫిదా అయినా నెటిజన్లు కూడా ప్రశంసలను కురిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. 
 
సితార  సోషల్ మీడియా సెలెబ్రిటీ అన్న సంగతి తెలిసిందే. ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె డ్యాన్స్ వీడియోలు కూడా నెటిజన్లను, ప్రిన్స్ అభిమానులను బాగానే ఆకట్టుకున్న దాఖలాలు వున్నాయి.