బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (11:41 IST)

మహేష్ బాబు సినిమాలో సీనియర్ నటి శోభన

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీవిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభనను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాలో హీరో పిన్ని పాత్ర చాలా ముఖ్యమైనదిగా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుందట. ఆ పాత్రకోసం శోభనను ఎంపిక చేశారని అంటున్నారు.
 
తెలుగులో హీరోయిన్‌గా శోభన ఒక వెలుగు వెలిగారు. కోకిల, అభినందన, రుద్రవీణ, రౌడీగారి పెళ్ళాం వంటి సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. 1993లో వచ్చిన "రక్షణ" కథానాయికగా ఆమె చివరి సినిమా, ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత ఆమె రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.