1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జులై 2025 (13:27 IST)

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

suicide
పాండిచ్చేరికి చెందిన ప్రపంచ సుందరి శాన్ రేచల్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె... ఆదివారం బీపీ మాత్రలను అధిక మోతాదులో తీసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
తన శరీరరంగు నలుపైనప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్రతిభా పాటవాల ద్వారా మోడల్ రంగంలో ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ అసలు పేరు శంకర ప్రియ. పుదుచ్చేరి కారామణి కుప్పంలో నివసిస్తున్నారు. 2020-2021లో మిస్ పాండిచ్చేరిగా, 2019లో 'మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు'గా, అదే ఏడాది 'మిస్ బెస్ట్ ఆటిట్యూడ్' ఇలా పలు అవార్డులను అందుకున్నారు. 
 
అనంతరం బ్లాక్ బ్యూటీ విభాగంలో ప్రపంచ సుందరి టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. ఇటీవల ఆమె ఫ్యాషన్ కార్యక్రమాలు నిర్వహించి బాగా నష్టపోయారని, ఆ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.