1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జులై 2025 (22:22 IST)

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

UP Police
UP Police
19 ఏళ్ల యువకుడు ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానీ ఆ యువకుడిని ఏఐ కాపాడింది. ఎలాగంటే.. యూపీకి చెందిన యువకుడు అతని ప్రియురాలి చేత మోసపోయానని.. ఆమె తనను బెదిరిస్తోందని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. 
 
అంతేగాకుండా.. ఆ మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని అందులో రాసుకొచ్చాడు. ఇంకా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
కానీ ఇక్కడే ఏఐ అలెర్ట్ అయ్యింది. ఆత్మహత్యకు సంబంధించిన మెసేజ్‌ను గుర్తించిన మెటా ఏఐ.. వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని అలర్ట్‌ చేసింది. 
 
దీంతో వెంటనే స్పందించిన పోలీసులు యువకుడి మొబైల్ నంబర్ ట్రాక్‌ చేశారు. కేవలం 15 నిమిషాల్లోనే అతడి ఇంటికి చేరుకున్నారు. ఉరేసుకునేందుకు సిద్ధమైన ఆ యువకుడిని కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు.