బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (19:48 IST)

సినిమా టిక్కెట్లపై చివరి భేటీ..

సినిమా టిక్కెట్లపై ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ గురువారం ఉదయం చివరి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ తుది భేటీతో సినిమా టికెట్ల ధరల విషయం ఓ కొలిక్కి వస్తుంది. 
 
ఉదయం 11.30 నిమిషాలకు ఈ కమిటీ సచివాలయంలో సమావేశమౌతుంది. ఇప్పటికే- దీనిపై తుది ప్రతిపాదనలను కమిటీ సిద్ధం చేసింది. తుది సమావేశంలో టికెట్ల శ్లాబులను నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేస్తుంది. 
 
రేట్లను నిర్ధారించడానికి ఇదివరకే ప్రభుత్వం- ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలను తీసుకుని.. టికెట్ల రేట్లను నిర్ధారించినట్లు చెబుతున్నారు. అయిదో ఆటకు అనుమతి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్టే.
 
కాగా.. టిక్కెట్ ధరల నిర్ధారణ, థియేటర్ల వర్గీకరణ అంశాలపై  హోమ్ శాఖ  ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ నేతృత్వంలో 13 మందితో కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.