16 నుంచి కోర్టుల్లో భౌతిక విచారణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా మేరకు తగ్గింది. దీంతో రాత్రిపూట కర్ఫ్యూను కూడా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి కోర్టుల్లో భౌతిక విచారణకు ఏపీ హైకోర్టు సమ్మతించింది.
హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వ కేంద్రాల్లో బుధవారం నుంచి భౌతిక విచారణలు జరుగనున్నాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏపీ రవీంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు.
కోవిడ్ మూడో దశ అల ప్రభావం కారణంగా జనవరి 17వ తేదీ నుంచి హైకోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాల్లో వర్చువల్ విధానంలో విచారణలు జరుగుతున్న విషయం తెల్సిందే.