1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 మే 2025 (13:05 IST)

బలగం నటుడు జీవీ బాబు మృతి

gv babu
బలగం సినిమాలో తన పాత్ర ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు, నటుడు జివి బాబు ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు. 
 
బలగం దర్శకుడు వేణు యెల్దండి జివి బాబు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. "ఆయన తన జీవితమంతా నాటక రంగానికే అంకితం చేశారు. బలగం ద్వారా జివి బాబును తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం నా అదృష్టం" అని వేణు అన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. 
 
రెండేళ్ల క్రితం విడుదలైన బలగం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం అందులో నటించిన నటీనటులకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇంకా కొత్త సినిమాల్లో నటించే అవకాశాలను సంపాదించి పెట్టింది. ఇందులో ప్రియదర్శి పాత్ర తాత అంజన్నగా జివి బాబు నటించారు.