శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: జనవరి 28 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు జనవరి 28వ తేదీ టీటీడీ విడుదల చేయనుంది. 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు స్పెషల్ ఎంట్రీ టికెట్లను విడుదల చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.
రోజుకు 12 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇక ఈనెల 29న సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నారు. రోజుకు 10వేల చొప్పున సర్వదర్శనం టోకెట్లు ఆన్‌లైన్‌లో లభ్యం కానున్నాయి.
ఫిబ్రవరి నెలలో ప్రత్యేక దర్శనం టికెట్లను పెంచాలని భావించినప్పటికీ... కరోనా వ్యాప్తి నేపథ్యంలో టికెట్లను పెంచలేదని అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.