ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (16:08 IST)

ఉద్యోగులను వాడుకుని వదిలేశారు.. జగన్‌ను మించివారు లేరు

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఉద్యోగులను వాడుకుని వదిలేశారని.. ఇలా చేయడంలో జగన్‌ను మించినవారు లేరంటూ మండిపడ్డారు. 
 
అన్నా.. అన్నా అంటూ అవసరం తీరాక అవమానకర రీతిలో సాగనంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు, ఉద్యోగుల పట్ల జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు.
 
ప్రతిపక్షాల నేతలను అరెస్ట్ చేసేందుకు అడ్డగోలుగా వాడుకున్నారని, అవసరం తీరాక అవమానకర రీతిలో సవాంగ్‌ను గెంటేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్, అజేయ కల్లాంలను కూడా జగన్ ఇలానే అవమానించారు. 
 
చీకటి జీవోల ఆద్యుడు ప్రవీణ్ ప్రకాశ్‌ను ఆకస్మికంగా ఢిల్లీ పంపించేశారు. జగన్ వ్యవహార శైలిని అందరూ అర్థం చేసుకోవాలి' అని యమమల కోరారు. డీజీపీ స్థాయి వ్యక్తికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారని ఆయన మండిపడ్డారు.