బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (13:08 IST)

పదిరూపాయల నాణెంపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

పదిరూపాయల నాణెంపై ప్రజల్లో వున్న అపోహలను తొలగించేందుకు కేంద్రం ప్రకటన చేసింది. పది రూపాయల నాణేలను వాడుకలో వున్నా కొందరు వ్యాపారులు తీసుకోవడం లేదు. దీంతో పాటు వారు గందరగోళానికి గురవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రూ.10 నాణేల అంశం మంగళవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. రూ.10 నాణేం చెల్లుతుందా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు ఎంపీ ప్రశ్నించారు.
 
ఈ సందర్భంగా రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని తేల్చి చెప్పేశారు. రూ.10 నాణేలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి చలామణిలో ఉంచిందని వెల్లడించారు. 
 
ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. ఎవరైనా రూ.10 నాణేలను స్వీకరించకపోతే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అన్ని లావాదేవీలకు ప్రజలు ఈ నాణేలను వాడుకోవచ్చని పంకజ్ సూచించారు.