మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:23 IST)

ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల లేఖ.. అందులో ఏముందంటే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఉద్యోగులు ఓ లేఖ రాశారు. ఇందులో పీఆర్సీ సాధన సమితి నేతలపై వారు విమర్శలు గుప్పించారు. అలాగే, పీఆర్సీ అంశంలో అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేశారంటూ వారు పేర్కొన్నారు.
 
రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను, ఆవేదనను మీ దృష్టికి తీసుకుని రావడంతో పీఆర్సీ సాధన సమితి నేతలు పూర్తిగా విఫలమయ్యారని వారు లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్  పేర్కొన్నారు. 
 
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలోని లోటుపాట్లను గుర్తించాలని కోరారు. అలాగే, తమకు జరిగిన అన్యాయంపై దృష్టిసారించాలని కోరారు. పీఆర్సీ సాధన సమితి ఇటీవల జరిపిన చర్యల్లో అశుతోష్ మిశ్రా నివేదిక అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన మండిపడ్డారు.