1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (13:24 IST)

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతోనే మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక కష్టాలు, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ, ఎంతమేరకు మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం అని అన్నారు. ఉద్యోగుల విషయాల్లోకి రాజకీయాలు వస్తే వాతావరణం దెబ్బతింటుందన్నారు. 
 
రాజకీయాలకు తావులేకుండా విధులు నిర్వహించాలని, ఏదేనీ సమస్య ఉంటే అనామలీస్ కమిటీకి విన్నవించుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందన్నారు. ఏ సమస్య ఉన్న వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే ఉద్యోగులది.. అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేసుకోవచ్చు అని  చెప్పారు. అంతేకాకుండా, శనివారం మంత్రుల కమిటీ తన ఆమోదంతోనే ఉద్యోగుల డిమాండ్లకు ఆమోదం తెలుపడం జరిగిందని వారితో సీఎం అన్నారు.