బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (10:33 IST)

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల ఖర్చు ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల కోసం భారీగానే ఖర్చు చేస్తుంది. గత 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.37,458 కోట్లను ఖర్చు చేసింది. గత యేడాది ఈ మొత్తం రూ.33102 కోట్లను వ్యయం చేసింది. 
 
అంటే, ప్రభుత్వ ఆదాయంలో ఏకంగా 36 శాతం మొత్తం ఉద్యోగుల వేతనాలకు ఖర్చు చేయడం గమనార్హం. ఈ విషయం ఓ నివేదిక బహిర్గతం చేసింది. ప్రభుత్వం మొత్తం ఖర్చులో వేతనాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇటీవల ఇచ్చిన నివేదికలోనూ పేర్కొంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అధికంగా ఉందని నివేదిక బహిర్గతం చేసింది. 
 
మిగులు బడ్జెట్‌తో, దేశంలోని ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల వాటా 21 శాతంగా ఉంది. కానీ, ఏపీలో మాత్రం ఇది 36 శాతంగా ఉంది. ఇపుడు కొత్త పీఆర్సీని అమలు చేయడం వల్ల ప్రభుత్వం ఖజానాపై అదనంగా మరో రూ.10 వేల కోట్ల అదనంగా పడనుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల రూపంలో రూ.68,430 కోట్లను ఉద్యోగుల వేతనాలకు ఖర్చు చేయడం గమనార్హం.