మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:56 IST)

కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలంటున్నారు.. మంత్రి ఆదిమూలపు

కొందరు కుహానా మేధావులు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారంటూ ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, కొందరు కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు సంకుచిత స్వభావంతో వ్యాఖ్యానాలు చేయరాదని కోరారు.