శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (14:01 IST)

సీఎం కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 
 
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ దళితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు, సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందుకు ఆయన ఇస్తున్నారని చెప్పారు. 
 
అయితే, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా 2019 ఏప్రిల్ 13వ తేదీన హైదరాబాద్‌ పంజాగుట్ట చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చేశామని గుర్తుచేశారు.
 
అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే మాకు తెలంగాణ రాష్ట్ర వచ్చిందని వీహెచ్ గుర్తుచేశారు. ఇపుడు మీరు రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ వారసత్వాన్ని తొలగించాలనుకుంటున్నారు. ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారని, కేసీఆర్ పెద్ద తప్పు చేస్తున్నారన్నారు.