శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (16:22 IST)

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌‌పై కేటీఆర్ ఫైర్: తెలంగాణపై సవతి తల్లి ప్రేమ

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌‌పై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి తిండి పెట్టే రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉందన్నారు కేటీఆర్​. ఈ మాట తాము చెబుతున్నది కాదని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోందని ఆయన పేర్కొన్నారు. 
 
అలాంటి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా మరోసారి మొండి చెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
 
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నింటినీ బుట్ట దాఖలు చేసి.. తెలంగాణ అసలు దేశంలో భాగమే కాదన్నట్లుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వ్యవహరించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని విమర్శించారు.
 
అంతకుముందు కేసీఆర్​ సైతం కేంద్ర బడ్జెటపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మాల సీతారామన్‌పై ఆయన నిప్పులు చెరిగారు. కనీస ఆలోచన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన దుయ్యబట్టారు.