గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (14:37 IST)

తెలంగాణ హైకోర్టుకు కొత్తా 12 మంది న్యాయమూర్తులు

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురు, న్యాయాధికారుల నుంచి ఐదుగురి పేర్లను జడ్జీలుగా కొలీజియం ప్రతిపాదించింది. 
 
న్యాయవాదులుగా కాసోజు సురేందర్, చాడా విజయ్ భాస్కర్ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫియుల్లా బేగ్, నాచరాజు శ్రవణ్ కుమార్ వెంకట్‌ల పేర్లు ఉన్నాయి. 
 
అలాగే న్యాయవాదులుగా ఉన్న వారిలో జి.అనుపమ చక్రవర్తి, ఎంజి.ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్ రెడ్డి, డి.నాగార్జున పేర్లను కొలీజియం సిఫార్సు చేసిన వారిలో ఉన్నారు. ఈ పేర్లన రాష్ట్రపతికి పంపించగా ఆయన పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సివుంది.