1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (17:05 IST)

ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు - కొలీజియం సిఫార్సు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ఒక్కసారిగా ఏడుగురు న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. ఈ నెల 29వ తేదీన సమావేశమైన కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలో సమావేశమైన కొలీజియం ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. 
 
ఈ కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల్లో రవి చీమలపాటి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డిబోయిన్ సుజాత, సత్తి సుబ్బారెడ్డి, తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లులను ఏపీ హైకోర్టుకు జడ్జీలుగా సిఫార్సు చేశారు. వీరంతా సీనియర్ న్యాయవాదులుగా ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించి న్యాయమూర్తులుగా నియమించనున్నారు. 
 
కాగా ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 20 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఇపుడు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేశారు. వీరి నియాకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సివుంది.