శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:32 IST)

పర్యాటకుల సౌలభ్యం కోసం ఏపీ టూరిజం కొత్త యాప్‌

ఏపీ టూరిజం శాఖ ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామ‌ని ఆ శాఖ‌ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. విశాఖ ప‌ట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కొవిడ్ కారణంగా టూరిజం శాఖ ఆదాయం తగ్గిందని, ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.

మంగళవారం విశాఖ తొట్ల కొండలో, పునర్నిర్మాణం చేసిన మహా స్తూపం, ఏమినిటీ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొట్ల కొండలో త్వరలోనే మెడిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం టూరిజం శాఖలో కొత్తగా ఒక యాప్‌ను తీసుకువస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.