గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:24 IST)

గ్రాండ్‌గా బాల‌కృష్ణ అఖండ కోసం సాంగ్‌

Akhanada still
నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టిస్తోన్న సినిమా `అఖండ‌`. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూడ‌వ సినిమా. ఈ చిత్ర క‌థ ప్ర‌కారం ప్ర‌ముఖ ఆల‌యాల‌న్నీ సంద‌ర్శించి అక్క‌డ షూట్ చేశారు. తాజాగా ఈ సినిమాలో ఓ పాట‌ను గ్రాండ్‌గా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవలే చిత్ర యూనిట్ గోవా వెళ్ళింది. 
 
ఇందులో మరో సాంగ్ ని కూడా మాసివ్ లెవెల్లో ఈ నెలాఖరున ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆల్బమ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కూడా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు వున్నాయి. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డినా ప్ర‌స్తుతం పరిస్థితులు మెరుగు ప‌డ‌డంతో ఈ చిత్రం షూటింగ్ నెలాఖ‌రువ‌ర‌కు చేసి పూర్తి చేయ‌నున్నారు.