1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (16:55 IST)

ఆర్టీపీసీఆర్ టెస్టులపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు సోమవారం మరోమారు విచారణ చేపట్టింది. ఇందులోభాగంగా, రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ప్రతి రోజూ కనీసం లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించింది. భౌతికదూరం, మాస్కులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న సూచించింది. అలాగే, కరోనా నియంత్రణ మార్గదర్శకాలపై మంత్రివర్గం సమావేశమై చర్చించనుందని చెప్పారు. 
 
హైకోర్టులో రేపటినుంచి వర్చువల్‌గా కేసులు విచారణ, ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నట్టు తెలిపింది. కోవిడ్ వ్యాప్తి వల్ల మళ్ళీ వర్చువల్ విచారణలు జరుపనున్నట్టు హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి హైకోర్టు వాయిదావేసింది.