శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:33 IST)

ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ

విద్యుత్ బకాయిలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్‌ల విద్యుత్ సరఫరాను ఒక్కసారిగా నిలిపివేసింది. 
 
దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ లోటును రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీసీ) ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది. అలాగే, అక్కడ అదనంగా మరో యూనిట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అయితే, అదనపు విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన బొగ్గు నిల్వలు తమ వద్ద లేదని ఆర్టీపీసీ ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. 
 
ఇదిలావుంటే, కృష్ణపట్న యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాగడం లేదు. సాంకేతిక సమస్య కారణంగా 810 మెగావాట్‌ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ కూడా ఐదు రోజులకు సరిపడ బొగ్గు మాత్రమే నిల్వవుంది.