సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:32 IST)

రాంగోపాల్ వర్మకు "చలిజ్వరం".. ఎందుకో తెలుసా?

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు చలిజ్వరం వచ్చింది. ఇది మామూలుగా వచ్చిన చలిజ్వరం కాదు. "ఛలో విజయవాడ" పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి వచ్చిన ఉద్యోగులను చూసి ఆయన బెదిరిపోయారు. దీంతో ఆయనకు చలిజ్వరం వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 
 
రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు యుద్ధం ప్రకటించిన విషయం తెల్సిందే. గురువారం 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్కడ చూసిన జనసందోహమే. ఎక్కడ విన్నా తమ డిమాండ్లతో నినాదే. ఓ వైపు ఎండ మండిపోతున్నా.. నడి రోడ్లపైనే కూర్చొని, నిలబడి, నినాదాలతో హోరెత్తించారు. 
 
ఈ 'ఛలో విజయవాడ' కార్యక్రమం సక్సెస్ కావడంతో ఉద్యోగులను ప్రభుత్వం మరోమారు చర్చలకు ఆహ్వానించింది. చర్చల ద్వారానా సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేసింది. సమ్మెలు, ఆందోళనతో ఏం సాధించలేరని ప్రభుత్వ సలహాదారులు అంటున్నారు. అయితే, ప్రభుత్వం సంగతేమే గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు మాత్రం వంట్లో జ్వరంకాసింది. 
 
దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు."సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలపడం నాకు షాక్. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా. అని నా సందేహం. అంటూ ఓ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే, ప్రభుత్వం సంగతేమోగానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది అంటూ ఛలో విజయవాడకు సంబంధించిన మరో ఫోటోను షేర్ చేశారు.