శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:30 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్ఈ పరీక్షలు ఎపుడు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాఠశాలలు సక్రమంగా జరగకపోయినప్పటికీ.. పాఠ్యాంశాల బోధన పూర్తికాకపోయినప్పటికీ మే నెలలో పదో తరగతి (ఎస్ఎస్ఈ) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
 
ఇందుకోసం పరీక్షల షెడ్యూల్‌కు సిద్ధం కావడానికి వ్యూహాలను రూపొందిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీ ఎస్ఎస్ఈ బోర్డు ఏప్రిల్ లేదా మే చివరి నాటికి పదో తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాల సమాచారం. 
 
అక్టోబర్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమై ఏప్రిల్ నెలాఖరు నాటికి విద్యా సంవత్సరం పూర్తవుతుంది. మార్చి నెలాఖరులోగా పూర్తి సిలబస్‌ను పూర్తి చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు, మేలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.